ప్రభుత్వానికి రుణపడి ఉంటాం  : సత్యనారాయణరెడ్డి 

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం  : సత్యనారాయణరెడ్డి 
  • టీపీఆర్ఎంఈఏ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జూనియర్, సీనియర్​ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్​అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి చెప్పారు. దాదాపుగా 240 మందికిపైగా పదోన్నతులు రావడంతో సోమవారం ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌లోని పీఆర్, ఆర్డీ శాఖ కార్యాలయంలో కమిషనర్​దివ్య దేవారాజన్‌‌‌‌‌‌‌‌ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, నందకుమార్, శ్రీనివాస్​రావు, అనంత్​ తదితరులు పాల్గొన్నారు.