టీచర్లకు ‘టెట్’ వద్దు టీపీటీఎఫ్‌‌‌‌‌‌‌‌ స్టేట్ కమిటీ డిమాండ్

టీచర్లకు ‘టెట్’ వద్దు టీపీటీఎఫ్‌‌‌‌‌‌‌‌ స్టేట్ కమిటీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల్లో 2010కి ముందు చేరిన టీచర్లకు ఇప్పుడు టెట్ పరీక్ష పెట్టి, పాస్ కాకపోతే తీసేస్తామనే నిబంధనను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌‌‌‌‌‌‌‌ టీచర్స్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ (టీపీటీఎఫ్‌‌‌‌‌‌‌‌)  డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ మాట్లాడారు. కేంద్రం పెట్టిన అశాస్త్రీయ నిబంధన నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపునిచ్చేలా రాష్ట్ర సర్కార్ చొరవ తీసుకోవాలని కోరారు. 

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేండ్లయినా దాని ఊసెత్తకపోవడం సరికాదని చెప్పారు. పీఆర్సీని వెంటనే ప్రకటించి ఉద్యోగుల ఆందోళనను తగ్గించాలని కోరారు. రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ అందక ఇబ్బంది పడుతున్నారని, పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న జీపీఎఫ్, టీఎస్‌‌‌‌‌‌‌‌జీఎల్‌‌‌‌‌‌‌‌ఐ, సరెండర్ లీవ్ బిల్లులు, డీఏలను అర్జెంట్‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయాలని సంఘం ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని తేవాలని, కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.