ఇంటర్ స్పాట్ డీఏ ఇవ్వాలి.. విద్యాశాఖ సెక్రటరీకి టీపీటీఎల్ఎఫ్ వినతి

ఇంటర్ స్పాట్ డీఏ ఇవ్వాలి.. విద్యాశాఖ సెక్రటరీకి టీపీటీఎల్ఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ స్పాట్ డీఏ, రెమ్యూనరేషన్ వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్​) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణకు టీపీటీఎల్​ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం అందించింది. 

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మార్చి, ఏప్రిల్​ నెలల్లో జరిగిన స్పాట్ వాల్యుయేషన్​లో పాల్గొన్న లెక్చరర్లకు ఇప్పటికీ డీఏ ఇవ్వలేదన్నారు. సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇతర ప్రాంతాల నుంచి స్పాట్ లో పాల్గొన్నారని తెలిపారు.

ALSO READ :ఉద్యోగాలనూ పర్మనెంట్​ చేయండి : అభియాన్ 

మరోపక్క ఇటీవల జరిగిన ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ వాల్యుయేషన్ రెమ్యూరేషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీటీఎల్​ఎఫ్ నేతలు కొమ్ము విజయ్, పుట్టపాగ విజయ్, డీవైఎఫ్​ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్​, వెంకటేశ్​ తదితరులు పాల్గొన్నారు.