తెలంగాణ పిలగాడి మెసెంజర్​

తెలంగాణ పిలగాడి మెసెంజర్​

సిటీల సదువుకునేవాళ్లకు చిన్న చిన్న ఊళ్లల ఉండే పిలగాళ్లు తీసిపోరని హుజూరాబాద్​కి చెందిన కన్నం అభి నిరూపించాడు. వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్ ​లెక్కనే పనిచేసే 
మెసెంజర్​ని డెవలప్ చేశాడు. ఆ మెసెంజర్​ పేరు ‘ట్రేస్​ చాట్’. ఈ యాప్​ని గూగుల్ ప్లే స్టోర్​లో పెట్టింది! 

మెసేజ్​లు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, డిజిటల్ ఫైల్స్ షేర్​ చేసుకోడానికి ఇప్పుడందరూ ​వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్ వాడుతున్నారు. సోషల్​ రిలేషన్స్​కి గూడ ఈ యాప్​లని తెగ వాడుతున్నారు. అందరూ వాడుతున్నట్టే అభి గూడ ఈ యాప్​లు వాడాడు. కానీ ఇవెలా పనిజేస్తయో తెలుసుకుని తనే ఇంకో కొత్త యాప్​ని తయారుచేశాడు. ​ఆండ్రాయిడ్​, ఇతర ఓఎస్​లతో పనిచేసే స్మార్ట్ ఫోన్లలో ట్రేస్​ చాట్ యాప్​ పనిచేస్తుంది. దీని ద్వారా మెసేజ్​లు, ఫైల్స్​ ట్రాన్స్​ఫర్​తో పాటు ఆడియో, వీడియో కాల్స్​ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్​కు యూజర్స్​ గూగుల్ ప్లేస్టోర్​లో 4.8 రేటింగ్​ ఇచ్చారు. యాప్​తోపాటు ట్రేస్​ వాల్​ హెచ్​డి యాప్​ని డెవలప్ ​చేశాడు అభి. ఇందులో16 కేటగిరీల్లో 500కు పైగా హెచ్​డి వాల్ పేపర్స్​ ఉన్నాయి. ఈయాప్​తో హెచ్​డి వాల్ పేపర్స్​డౌన్​లోడ్​ చేసుకోవడంతో పాటు ఫ్రెండ్స్​తో పంచుకోవచ్చు కూడా.

చిన్నప్పట్నించే..
అభికి టెక్నాలజీ విషయాలంటే బాగా ఇష్టం. చాలా విషయాలను యూట్యూబ్​లో చూసి నేర్చుకున్నాడు. ఎనిమిదో తరగతి చదివేప్పటి నుంచి మొబైల్స్, కార్లలో ఉపయోగించే టెక్నాలజీ గురించి యూట్యూబ్​లో తెలుసుకున్నాడు. ఆ తరువాత రోబో తయారుచేశాడు. స్కూల్ సైన్స్​ ఫెయిర్​లో ఆ రోబోని ఎగ్జిబిట్​ కూడా చేశాడు. తొమ్మిదో తరగతి పూర్తి చేసిన అభి వేసవి సెలవుల్లో యూట్యూబ్​ సాయంతో పలు రకాల అప్లికేషన్స్​ గురించి తెలుసుకుని, ట్రేస్​ చాట్​ యాప్​ని డెవలప్​​ చేశాడు. దీన్ని తయారుచేసేందుకు 45 రోజులు పట్టింది. ఇంతకు ముందు మూడు వెబ్​ సైట్స్​ డిజైన్ ​చేసిండు.

బిగ్​ డ్రీమ్​ 
‘‘మా నాన్న శ్రీనివాస్​ గవర్నమెంట్ స్కూల్ టీచర్​. హుజూరాబాద్​లో ఉన్న కేరళ ఇంగ్లిష్​ మీడియం స్కూల్లో చదువుతున్నా. పెద్దయ్యాక సాఫ్ట్​వేర్​ కంపెనీ పెట్టాలనేది నా కల.’’