
నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు మండలం నల్లవెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ కు ఉన్న పల్లీ కోత యంత్రం బోల్తా పడి ముగ్గురు మరణించారు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను లింగసానిపల్లికి చెందిన జయమ్మ, గౌరమ్మ, తిక్కన్నగా గుర్తించారు. గాయపడ్డవారిని హస్పిటల్ కి తరలించారు.