చిన్న పంచాయతీలకు ట్రాక్టర్ కష్టాలు

చిన్న పంచాయతీలకు ట్రాక్టర్ కష్టాలు

స్పెషల్‌‌ ఫండ్స్ ఇవ్వాలని డిమాండ్‌‌

ఈఎమ్‌‌ఐలు, మెయింటెనెన్స్‌‌కు ఇబ్బంది పడుతున్న సర్పంచులు

డీపీవోను కోరిన సర్పంచులు

ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ

సర్కార్‌‌‌‌ ఇచ్చిన ట్రాక్టర్లు చిన్న గ్రామ పంచాయతీలకు భారమవుతున్నాయి. వీటి ఇన్‌‌స్టాల్‌‌మెంట్లు, మెయింటెనెన్స్‌‌ ఖర్చులు చెల్లించలేక సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్‌‌ సిబ్బంది జీతాలు, కరెంట్‌‌ బిల్లులకు కూడా సరిపోకపోవడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. రోడ్‌‌ ట్యాక్స్‌‌ మాఫీ చేయాలని, మెయింటెనెన్స్‌‌ ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు.

ఎడపల్లి, వెలుగు: ట్రాక్టర్ల  నెలవారీ ఇన్‌‌స్టాల్‌‌ మెంట్‌‌ మినిమమ్‌‌ రూ.11 వేలు , డ్రైవర్‌‌‌‌ జీతం రూ.8,500, రోడ్‌‌ ట్యాక్సులు నెలకు రూ. వెయ్యి వరకు చెల్లించాల్సి వస్తోంది. వీటికితోడు డీజిల్‌‌ ఖర్చులు, మైనర్‌‌‌‌ రిపేర్లకు ఖర్చులు అదనం. కొన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ట్రాలీకి, ట్యాంక ర్‌‌‌‌కు కూడా లోన్‌‌ తీసుకున్నారు. ఇలాంటి వారు నెలకు రూ.15 వేల వరకు ఇన్‌‌స్టాల్‌‌మెంట్లు కట్టాల్సి వస్తోంది. సాధారణంగా జీపీలకు ఆర్థిక సంఘం ఇచ్చే నిధులే ఆధారం. పన్నులు ఎక్కువగా వసూలు కావు. వీటితోనే సిబ్బంది వేతనాలు, జీపీ మెయింటెనెన్స్‌‌ ఖర్చులు భరించాలి. ఉదాహరణకు ఎడపల్లి మండలం దుబ్బతండా గ్రామ పంచాయతీని తీసుకుంటే ఊరి జనాభా 900.  ట్రాక్టర్‌‌‌‌, ట్యాంకర్‌‌‌‌, ట్రాలీని కొన్నారు. గవర్నమెంట్ ఏడాదికి రూ. 12.5 లక్షల ఫండ్స్ మంజూరు చేస్తోంది. అయితే ట్రాక్టర్‌‌‌‌ ఈఎమ్‌‌ఐ, డీజిల్‌‌ ఖర్చులు, డ్రైవర్‌‌‌‌, మల్టీపర్పస్‌‌ వర్కర్స్‌‌ వేతనాలు, కరెంట్‌‌ బిల్లులు, పంచాయతీ మెయింటెనెన్స్‌‌ అన్ని ఖర్చులు కలిపితే ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఇతర పనులు చేయలేకపోతున్నట్లు సర్పంచ్‌‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కమర్షియల్‌‌ రిజిస్ట్రేషన్‌‌తో…

పంచాయతీల అవసరాలకు కొన్న ఈ ట్రాక్టర్లను కమర్షియల్‌‌ విభాగంలో రిజిస్ట్రేషన్‌‌ చేయించడంతో రోడ్‌‌ ట్యాక్స్‌‌ చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో ట్రాక్టర్‌‌‌‌కు, ట్యాంకర్‌‌‌‌, ట్రాలీ అన్నింటికి కలిపి మూడు నెలలకు రూ.మూడు వేల వరకు కడుతున్నారు. ట్రాక్టర్లు ఇచ్చిన కొత్తలోనే రోడ్‌‌ ట్యాక్స్‌‌ తొలగించా లని సర్పంచులు కోరారు. కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. గ్రామ పంచాయతీ పనులకే వాడుతున్నందున ట్యాక్స్‌‌ రద్దు చేయాలని సర్పంచులు కోరుతున్నారు. అలాగే ట్రాక్టర్ మెయింటెనెన్స్‌‌కు డబ్బులివ్వాలని కోరుతున్నారు. ఇటీవల ఎడపల్లి మండలంలోని మైనర్‌‌‌‌ గ్రామ పంచాయతీల సర్పంచులు అందరూ డీపీవో జయసుధను కలిసి ఈ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

మెయింటెనెన్స్‌‌కు పైసలు ఇవ్వాలి..

ఆఫీసర్లు చెప్పడంతో ట్రాక్టర్లు కొన్నం. కానీ ఇవి అదనపు భారంగా మారాయి. ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్‌ సరిపోతలేవు. ట్రాక్టర్‌ మెయిం టెనెన్స్‌ కోసం అదనంగా ఫండ్స్‌ ఇవ్వాలి. రోడ్‌‌ ట్యాక్స్‌ రద్దు చేయాలి. – దశరథ్, సర్పం చ్, దుబ్బతండా

కష్టమైతుంది..

ట్రాక్టర్‌‌‌‌ ఖర్చులు, డ్రైవర్‌‌‌‌ జీతం సర్కారే ఇయ్యాలె. ట్యాక్సులు రద్దు చేయాలె. పైసలు లేక ట్రాలీ, ట్యాంకర్‌‌‌‌కు ఇంకా కట్టలేదు. వాళ్లు డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తేవాలి. సర్కార్‌‌‌‌ ఇచ్చే పైసలు సరిపోతలేవు.-మేఘావత్ సునీత రవి, సర్పంచ్‌, బాపునగర్.