
ములుగు జిల్లా : వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడటంతో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు జిల్లా, వెంకటాపురం మండలం ,రాచపల్లి గ్రామ సమీపంలో జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నాంపల్లి గ్రామం నుంచి ములుగు జిల్లాలోని ఒంటిమామిడిపల్లి గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మందికి స్వల్ప గాయాలు కావడంతో.. ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.