నిమజ్జనానికి వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి

V6 Velugu Posted on Oct 17, 2021

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ అమ్మవారి నిమజ్జనం కోసం వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరికొంతమంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‎లో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కమలాపురం గ్రామానికి చెందిన కొంతమంది యువకులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరిరోజు అమ్మవారి విగ్రహాన్ని గందసిరి మున్నేరులో నిమజ్జనం చేసేందుకు బయలుదేరారు. కమలాపురం దాటిన తర్వాత ఇసుక బావి దగ్గర ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు కమలాపురానికి చెందిన అవసాని ఉపేందర్, ములకలపల్లి ఉమా, చోడ బోయిన నాగరాజు, బిచ్చాల యలగొండ స్వామిగా గుర్తించారు. 

Tagged Telangana, Khammam district, immersion, tractor overturns, durga matha immersion

Latest Videos

Subscribe Now

More News