ఈ వారం క్రూడాయిల్పై ట్రేడర్ల దృష్టి

ఈ వారం క్రూడాయిల్పై ట్రేడర్ల దృష్టి

న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌ను ఇరాన్ యుద్ధానికి సంబంధించిన వార్తలు, క్రూడాయిల్ ధరలు నిర్ణయిస్తాయని ఎనలిస్టులు తెలిపారు.   గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, విదేశీ పెట్టుబడిదారుల ట్రేడింగ్, రూపాయి–డాలర్ కదలికలు కూడా కీలకమని అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం  మార్కెట్లకు సెలవు. 

 దీంతో ఈ వారం నాలుగు రోజులే ట్రేడింగ్ ఉంటుంది. ఇండియా హెచ్‌‌ఎస్‌‌బీసీ పీఎంఐ మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్, కంపోజిట్ డేటా మార్చి 24న, యూఎస్ ఇనీషియల్ జాబ్‌‌లాస్‌‌  క్లెయిమ్స్‌‌ డేటా 26న వెలువడనున్నాయి. మార్కెట్‌‌పై వీటి ప్రభావం ఉంటుంది.    విదేశీ పెట్టుబడిదారులు ఈ  నెలలో ఇప్పటివరకు నికరంగా రూ.88,180 కోట్లు (9.6 బిలియన్ డాలర్లను) ఉపసంహరించుకున్నారు. 

నికర అమ్మకందారులుగా కొనసాగుతున్నారు. దీంతో మార్కెట్‌‌, రూపాయి పడుతున్నాయి. ఇన్వెస్టర్లు విదేశీ ఇన్వెస్టర్ల కదలికలపై ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు తెలిపారు.   బ్రెంట్ క్రూడ్ ధరలు 100 డాలర్లపైన ఎక్కువ కాలం కొనసాగితే  ఇండియా ద్రవ్యోల్బణం,  కరెంట్ అకౌంట్ పెరుగుతుందని  హెచ్చరించారు.