హైదరాబాద్: పరీక్షలు రాయడానికి వెళుతుండగా ఇంటర్ విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురైంది. వారికి మహంకాళి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చికిత్స అందించి సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. ఇవాళ సిటీకి చెందిన విద్యార్థిని తన తండ్రితో కలిసి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు బైక్పై వెళ్తోంది. సికింద్రాబాద్ ఎంజీ రోడ్ మార్గంలో ఉన్న ఓ కళాశాల వద్ద బైక్ అదుపుతప్పడంతో కింద పడిపోయారు. విద్యార్థిని తలకు గాయాలయ్యాయి.
అక్కడే డ్యూటీ చేస్తున్న మహంకాళి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఉపాశంకర్ స్పందించి వెంటనే తన వెహికల్లో దగ్గరలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. తిరిగి పరీక్ష కేంద్రానికి సరైన సమయంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌కు విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది.
