సైబర్ టవర్స్​ రూట్‌‌‌‌లో నో ఎంట్రీ

సైబర్ టవర్స్​ రూట్‌‌‌‌లో నో ఎంట్రీ

సైబర్ టవర్స్​ రూట్‌‌‌‌లో నో ఎంట్రీ
వీవీఐపీ, వీఐపీ మూవ్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో ప్రొటోకాల్‌‌‌‌
ఐటీ ఎంప్లాయ్స్​కు వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోం ఇవ్వాలని పోలీసుల సూచన

హైదరాబాద్‌‌‌‌/గచ్చిబౌలి, వెలుగు: ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఐటీ కారిడార్​లో భారీ బందోబస్తుతోపాటు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. శని, ఆదివారాలు ట్రాఫిక్ డైవర్షన్స్ విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌‌‌‌రావు గురువారం నోటిఫికేషన్‌‌‌‌ రిలీజ్ చేశారు. ఈ రెండు రోజులు సైబర్‌‌‌‌‌‌‌‌ టవర్స్‌‌‌‌, హైటెక్స్‌‌‌‌ జంక్షన్ల మీదుగా వెహికల్స్​కు అనుమతిలేదని స్పష్టం చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, కార్యకర్తల మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఐటీ ఎంప్లాయ్స్, ఇతర ఉద్యోగులు, వాహనదారులకు పలు సూచనలు చేశారు. కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ  జంక్షన్, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్‌‌‌‌ స్టేషన్, ఐకియా రోటరీ మధ్య ఉండే ఆఫీసుల టైమింగ్స్‌‌‌‌ మార్చుకోవాలని సూచించారు. వర్క్‌‌‌‌ఫ్రం హోంకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. భారీ వాహనాలుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. హెచ్‌‌‌‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో ఐదు ట్రాఫిక్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బూతులను ఏర్పాటు చేస్తున్నారు.

ఆంక్షలు ఉండే రూట్లు

-నీరూస్‌‌‌‌ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్‌‌‌‌ మీదుగా కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను మాదాపూర్‌‌‌‌‌‌‌‌ సీఓడీ జంక్షన్ వద్ద డైవర్ట్‌‌‌‌ చేస్తారు. అక్కడ లెఫ్ట్‌‌‌‌ టర్న్ తీసుకొని దుర్గంచెరువు, ఇనార్బిట్ మాల్, ఐటీసీ కోహినూర్, ఐకియా జంక్షన్ వద్ద లెఫ్ట్‌‌‌‌ తీసుకుని బయోడైవర్సిటీ జంక్షన్​కు చేరుకోవాలి. అక్కడి నుంచి రైట్‌‌‌‌ తీసుకుని గచ్చిబౌలి జంక్షన్ మీదుగా కొత్తగూడ ట్రావెల్‌‌‌‌ చేయాలి.

-మియాపూర్, హఫీజ్​పేట్, కొండాపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి హైటెక్​సిటీ,సైబర్ టవర్స్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్ కొత్తగూడ జంక్షన్, బొటానికల్ గార్డెన్, ఏఐజీ హాస్పిటల్, ఐకియా, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు, సీఓడీ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్లాలి.

-ఆర్సీపురం, చందానగర్, లింగంపల్లి నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వెహికల్స్ ఆల్విన్ ఎక్స్‌‌‌‌రోడ్, కొండాపూర్ మీదుగా వెళ్లకుండా బీహెచ్ఈఎల్, నల్లగండ్ల,హెచ్​సీయూ, ఐఐఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు ట్రావెల్‌‌‌‌ చేయాలి.