ఏప్రిల్ 7 నుంచి కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్..ఎందుకంటే..?

ఏప్రిల్ 7 నుంచి కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్..ఎందుకంటే..?

హైదరాబాద్  లోని కేబుల్ బ్రిడ్జిపై 3 రోజుల పాటు రాకపోకలను నిషేదిస్తూ  అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  కేబుల్ బ్రిడ్జ్  మెయింటనెన్స్  పనుల్లో భాగంగా  బ్రిడ్జిపై భారీ యంత్రాలతో మరమ్మతులు చేపడుతుండటంతో  రాకపోకలను నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 6 అర్థరాత్రి నుంచి అంటే ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 10 వ తేదీ ఉదయం వరకు బ్రిడ్జిని మూసేస్తున్నట్లు తెలిపారు.    బ్రిడ్జి బ‌రువును ప‌రిశీలించేందుకు గానూ.. దానిపై 100 ట‌న్నుల క్రేన్లు ఉంచ‌నుంది జీహెచ్ఎంసీ.  ఈ క్రమంలోనే   ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.  వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని చెప్పారు.  ప్రజలు సహకరించాలని కోరారు.

జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లాలని సూచించారు. ఐకియా నుంచి జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు,  మాదాపూర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పోలీసులు కోరారు.