
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ యువకుడిని దారుణంగా కొట్టిన షాకింగ్ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టపగలు యువకుడిని తన్నడం చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కింది. యువకుడు తనను కొట్టొద్దని చేతులు జోడించి వేడుకున్నా వినకుండా ఆ ట్రాఫిక్ పోలీస్ కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. పోలీసులు దౌర్జన్యాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. శుక్రవారం (ఫిబ్రవరి 9) సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ వీడియోను వేలసంఖ్యలో నెటిజన్లు చూశారు.
ముంబైలోని శంభాజీ నగర్ లోని ఓ ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా వైరల్ వీడియోలోని యువకుడు హెల్మెట్ లేకుండా బైక్ వెళ్తూ కనిపించాడు. దీంతో పోలీసులు యువకుడిని అడ్డుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఒకరు యువకుడిని బలవంతంగా బైక్ పై నుంచి లాగి కొట్టడం ఈ వీడియో కనిపిస్తుంది. యువకుడిని ముందు , వెనక నుంచి తన్ని ముందు తోసేసి బ్రిడ్జి వైపు మూలకు తీసుకెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వంతెన కింద బెంచ్ పై కూర్చోబెట్టి మళ్లీ యువకుడి ముఖంపై చెంపదెబ్బ కొట్టాడు.
పోలీసుల దౌర్జన్యాన్ని చూసిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. యువకుడిని దారుణంగా కొట్టిన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడైన పోలీస్ అధికారిపై త్వరగా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి , హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ని కోరారు.
ALSO READ :- వ్యవసాయం చేసే వారికే రైతు భరోసా : సీఎం రేవంత్ రెడ్డి
అంతేకాదు ఈ వీడియోని ముంబై ట్రాఫిక్ పోలీసు విభాగానికి ట్యాగ్ చేశారు. మహారాష్ట్రలోని శంభాజీ నగర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుందని ముంబై పోలీసులు ధృవీకరించారు. చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు.
ट्राॅफिक वाल्याची दादागिरी बघा. This is inhuman and has no right to touch civilians. He shall be terminated With Immediate Effect @MTPHereToHelp @CPMumbaiPolice @Dev_Fadnavis @India_NHRC @mid_day @DGPMaharashtra @MahaDGIPR
— Darshan Soni (@DarshanSoniCRPC) February 8, 2024
Strict and immediate action is expected.
Jai Hind ?? pic.twitter.com/GRs30vHOR3