వ్యవసాయం చేసే వారికే రైతు భరోసా : సీఎం రేవంత్ రెడ్డి

వ్యవసాయం చేసే వారికే రైతు భరోసా : సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. మీడియాతో చిట్ చాట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వ్యవసాయం చేసే వారికే రైతు భరోసా ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో వ్యవసాయం చేయని వాళ్లకే ఎక్కువగా రైతు బంధు పడిందని.. రైతు బంధు విధానంలో మార్పులు తీసుకొచ్చి.. వ్యవసాయం చేసే వాళ్లకే రైతు భరోసా వచ్చే విధంగా ప్రణాళిక రచిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అసెంబ్లీలో వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని, గతప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని  సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీ రద్దు చేస్తామన్న సీఎం..   బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పథకాలకు రేషన్ కార్డులు లేకపోతే రేషన్ కార్డులు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆరోగ్య శ్రీ పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నామన్నారు. 

ALSO READ :- బిట్ కాయిన్ తో రూ. 6 వేల 600 కోట్ల స్కాం.. 

 రైతు బంధు కొత్త నిబంధనలు వచ్చిన వెంటనే ఎకరాకు 15 వేల రూపాయలు వేస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.  కౌలు రైతులకు కూడా రైతు బంధు సాయం అందేలా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.  కౌలు రైతులకు రైతు బరోసా సాయం అందించటానికి మార్గదర్శకాలు తయారు అవుతున్నాయని.. త్వరలోనే విడుదల చేస్తామని వివరించారు మంత్రి భట్టి .  రైతులు, కౌలు రైతులకు పంట బీమాలో కొత్త విధివిధానాలు తీసుకొస్తామని.. ఇందు కోసం పశ్చిమ బెంగాల్ తరహా పథకాన్ని అద్యయనం చేస్తున్నట్లు వివరించారు.