బిట్ కాయిన్ తో రూ. 6 వేల 600 కోట్ల స్కాం..

బిట్ కాయిన్ తో రూ. 6 వేల 600 కోట్ల స్కాం..

ఆన్ లైన్ మార్కెట్ అనేది అనుబాంబు కంటే ప్రమాదకరంగా మారింది. దేశంలోని చిన్నా పెద్దా అని తేడాలేకుండా ఆన్ లైన్ లో డబ్బులు పోగొట్టుకునేవారి సంఖ్య పోగొట్టుకున్న డబ్బుల విలువ రోజు రోజుకు పెరుగుతుంది. బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు పొందండని ఓ సంస్థ భారీ మొత్తంలో స్కాం చేసింది.  
 
వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టండి అధిక మొత్తంలో లాభాలు పొందండని సామాన్య ప్రజలకు వల వేసింది. ‘గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌ ను ప్రారంభించి మల్టీ లెవల్ మార్కెటింగ్ తో ఢిల్లీ, ముంబాయి వంటి పెద్ద నగరాల్లోని సామాన్యులకు దగ్గరైంది.    అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేసింది.  సంస్థ మోసగిస్తుందని అనుమానంతో ఢిల్లీ, ముంబాయిలో పలువురు కేసులు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ కేసును టేక్ ఓవర్ చేసింది. ఢిల్లీకి చెందిన భరద్వాజ్ కుటుంబంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. 

ఈ కేసులో ప్రధాన నిందితులు వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు చెందిన అజయ్ భరద్వాజ్,  అతని సోదరులు అమిత్ భరద్వాజ్, వివేక్‌ భరద్వాజ్‌, మహేందర్‌ భరద్వాజ్‌ అనే వ్యక్తులు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. వేరియబుల్‌టెక్‌పై 15కు పైగా చీటింగ్ కేసులు నమోదైయ్యాయి. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.  భరద్వాజ్  కుటుంబం ఆ మొత్తం డబ్బును చిన్న చిన్న కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారని వాటి గురించి భరద్వాజ్ కుటుంబం విచారణలో చెప్పడం లేదని ఈడీ తెలిపింది.

ALSO READ :- టూరిజం సర్క్యూట్గా వేములవాడ, బాసర , భద్రాచలం

 ఈ క్రమంలోనే ఈడీ వారి కుటుంబం ఆదాయపు పన్ను ఫైళ్లను పరిశీలించింది, 2021-2022 వార్షిక సంవత్సర కోసం సింపీ ప్రకటించిన ఆదాయం సంవత్సరానికి రూ. 2.88 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది. అదే ఏడాదికి ఆమె భర్త అజయ్ రూ. 3.10 లక్షలు, ఆమె బావ మహేందర్ రూ.4.35 లక్షలు, చూపించారని తెలిపింది. వారి మొత్తం ఆదాయం వారి నెలవారీ ఖర్చు కంటే చాలా తక్కువగా ఉన్నట్టు ఈడీ అనుమానిస్తుంది.