టూరిజం సర్క్యూట్గా వేములవాడ, బాసర , భద్రాచలం

టూరిజం సర్క్యూట్గా వేములవాడ, బాసర , భద్రాచలం

పవిత్ర పుణ్యక్షేత్రాలైన వేములవాడ, బాసర , భద్రాచలం,  జమాలాపురం( చిన్న తిరుపతి), ధర్మపురిలను  అనుసంధానం చేస్తూ  టూరిజం సర్క్యూట్ గా  ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.  ఈ దేవస్థానాలను మరింత ఆకర్షణీయంగా, భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాల అన్యాక్రాంత భూములను గుర్తించి వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.  గిరిజనుల అతిపెద్ద జాతరైన  మేడారం జాతరను ఘనంగా నిర్వహించబోతున్నామని..  సమ్మక్క, సారలమ్మ తల్లులను  దర్శించుకోవడానికి అన్ని సౌకర్యాలను  కల్పించామన్నారు.  భక్తులు వీలుగా బంగారం మొక్కలు చెల్లించుకునేందుకు  వీలుగా ఆన్ లైన్ పోర్టల్ కూడా ప్రారంభించామన్నారు. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం శాస‌న‌స‌భ‌లో  ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్రవేశ పెట్టింది.  2024-25 ఆర్థిక సంవ‌త్సరానికి రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టిన‌ట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్రమార్క తెలిపారు.