కలెక్టర్ వాహనానికి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు

కలెక్టర్ వాహనానికి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు

సూర్యాపేట : రూల్స్ అందరికీ సమానం అని నిరూపించారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్ వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. TS29F0001 నెంబర్ గల వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆమయ్ కుమార్ వినియోగిస్తుండగా.. TS29 F7979నంబర్‌ గల వాహనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వినియోగిస్తున్నారు. ఈ రెండు వాహనాలు రాచకొండ సైబర్‌బాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ లోని పలు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని స్పీడ్‌ లేజర్‌ గన్‌తో ఫైన్ విధించారు.

ఖమ్మంలో రాంగ్ పార్కింగ్, అతి వేగంతో వాహనం నడిపినందుకు జిల్లా కలెక్టర్ వాహనానికి రూ.2వేల 305 ఫైన్ వేయగా.. 8 సార్లు స్పీడ్ లిమిట్ బ్రేక్ చేసినందుకు జాయింట్ కలెక్టర్ వాహనానికి రూ.8 వేల 680 ఫైన్ విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీస్‌శాఖ వాహనాల అతివేగాన్ని నిరోధించేందుకు స్పీడ్‌ లేజర్‌ గన్‌ ను అందుబాటులోకి తెచ్చారు. రహదారులపై నిర్ధేశించిన వేగానికంటే అధికవేగంతో వెళ్తే స్పీడ్‌ లేజర్‌ గన్‌ పసిగడుతుంది. దీంతో ఈ–చలాన్‌ ద్వారా జరిమానా విధించడం జరుగుతోంది. ఈ క్రమంలోనే కలెక్టర్ల వాహనాలకు ఫైన్ వేశామని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు.