
ఓ అందమైన అమ్మాయి. వెహికిల్ నడుపుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఓ ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. ఆమెకు ఫైన్ వేశాడు. అమ్మాయి ఎందుకని అడిగింది. ‘ఇంత అందంగా ఉన్నావ్. వెహికిల్ నడుపుతున్నావ్. పక్కన వెళ్తున్న వాళ్లు బండ్లు నడపాలా వద్దా? నీ అందంతో వాళ్లను ఇబ్బంది పెడుతున్నావ్. వాళ్ల ఏకాగ్రతను నీవైపుకు తిప్పుకున్నావ్’ అన్నాడు. చలాన్ వేశాడు. దానిపై ‘టీ అమో’ అని స్పానిష్‌లో రాశాడు. అంటే ‘ఐ లవ్ యూ’ అని. ఇదికాస్త వైరలైంది. ఇంకేముంది దీనిపై అధికారులు ఎంక్వైరీకి ఆదేశించారు. ఇదంతా జరిగింది ఆఫ్రికా ఖండంలోని ఉరుగ్వే దేశంలో. ఆ పోలీసు పనిని కొందరు పొగుడుతుంటే, మరికొందరేమో ‘ఇదేం పని’ అంటూ తిడుతున్నారు.