లోక్ అదాలత్ లో రూ.10లక్షల52 వేల500 ఫైన్లు వసూలు

లోక్ అదాలత్ లో రూ.10లక్షల52 వేల500 ఫైన్లు వసూలు

రూల్స్ బ్రేక్ చేసి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డవారు శనివారం లోక్ అదాలత్ లో ఫైన్లు కట్టి వాహనాలను తీసుకువెళ్లారు. మద్యం తాగి వాహనంనడిపి చిక్కి న వారు, డ్రైవిం గ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపిన వారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వారందరికీ జైలు శిక్ష విధించకుం డాఫైన్ విధించి కూకట్ పల్లి కోర్టు కేసులను కొట్టివేసింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి పట్టుబడ్డ తమ వాహనాలను తీసుకెళ్లకపోవడంతో ఆయాపోలీస్ స్టేషన్లలో వాహనాలు నిండి పోయాయి.దీంతో శనివారం మియాపూర్ లోని శ్రీకల్యాణ్ గార్డెన్ లో కూకట్ పల్లి నాలుగో మెట్రో పాలిటన్కో ర్డు ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. కూకట్ పల్లి, బాలానగర్, మాదాపూర్,మియాపూర్, గచ్చి బౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లపరిధిలో డ్రంకన్ డ్రైవ్, డ్రైవిం గ్ లైసెన్సు లేకుండా నడిపి న  వారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డవారందరికి జడ్జి శ్రీదేవి ఫైన్లు విధించి వాహనాలను అప్పగించారు. మాదాపూర్, గచ్చి బౌలి ట్రాఫిక్పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువ కేసులు ఉన్నాయి.లోక్ అదాలత్ లో మొత్తం 729 కేసులు పరిష్కరిం చారు. రూ.10,52,500 లను ఫైన్లరూపంలో వసూలు చేసి కేసులు కొట్టివేశారు. ఇందులో డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 457 మంది,లైసెన్సు లేకుండా నడిపిన వారు 267 మంది,సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసుల్లో పట్టుబడ్డవారు 5మంది ఉన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డవారికి రూ.2,000, డ్రైవింగ్ లైసెన్సు లేని వారికి రూ.500, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి పట్టుబడ్డ వారికిరూ.1,000 చొప్పున జరిమానా విధించారు.