స్కూల్ బస్సులు, ఆటోలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

స్కూల్ బస్సులు, ఆటోలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ స్కూల్ బస్సులు, ఆటోలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న బస్సులు, ఆటోలు, వాటిని నడుపుతున్న డ్రైవర్లను నియంత్రించేందుకు ఈ నెల 12 నుంచి ప్రత్యేక డ్రైవ్ జరుపుతున్నారు. ఈ డ్రైవ్ లో 3వేల 873 కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్- రవాణా అధికారులు కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి బస్సులు, ఆటోలు నడుపుతున్న 14 మంది డ్రైవర్లను పట్టుకున్నారు. లైసెన్స్ లేకుండా ఆటోలు, బస్సులు నడుపుతున్న 19వందల 13 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఆటోలు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్తున్న 15వందల 28 ఆటో డ్రైవర్లు, 385 మంది బస్సు డ్రైవర్లపై ఎంవీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకున్నారు.

ఆటోలు, బస్సుల్లో స్కూళ్లకు పంపుతున్న తల్లిదండ్రులు పిల్లల భద్రతపై ఆలోచించాలని ట్రాఫిక్  పోలీసులు సూచిస్తున్నారు. ఆటోల్లో విద్యార్థులను పరిమితికి మించి తీసుకువస్తున్నారని తెలిపారు. వేగంగా వెళ్తుండటంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా బస్సులు, వ్యాన్ల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోలు, బస్సులను చూస్తే.. ప్రజలు కూడా ఫోటోలు తీసి ఫేస్ బుక్ , ట్విట్టర్  ద్వారా తమకు పంపాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.

జగిత్యాల జిల్లా  కోరుట్ల  ప్రభుత్వ  హైస్కూల్ లో…. నో అడ్మిషన్లు  బోర్డు పెట్టారు. బడిబాట  కార్యక్రమం  సక్సెస్ కావడంతో  పిల్లలు  పెద్ద సంఖ్యలో  చేరారు. ఇంగ్లీష్ మీడియంకు  సంబంధించిన  సెవన్త్  టూ  టెన్త్ వరకు  క్లాస్ రూములు  నిండిపోయాయి.  తరగతి  గదులు  లేకనే ….నో అడ్మిషన్  బోర్డులు పెట్టాల్సి  వచ్చిందని  అంటున్నారు ఉపాధ్యాయులు.