
పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి (లష్కర్) బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయానికి లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
- మహంకాళి ఆలయం నుంచి టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ రోడ్లను పూర్తిగా మూసివేయనున్నారు.
- సుభాష్ రోడ్డులో బాటా నుంచి రోచా బజార్, మహంకాళి టెంపుల్ నుంచి ఆదయ్య ఎక్స్ రోడ్డు, జనరల్ బజార్ వరకు రోడ్లు మూసివేస్తారు.
- కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే జనరల్ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులు.. రాణిగంజ్ఎక్స్రోడ్డు వద్ద మినిస్టర్ రోడ్ – రసూల్ పురా ఎక్స్ రోడ్ల మీదుగా పీఎన్టీ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్, సీటీఓ, గోపాలపురం లేన్ మీదుగా రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు.
- సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ ఎక్స్ రోడ్డు , గాంధీ దవాఖాన, కవాడిగూడ మీదుగా మళ్లిస్తారు.
- రైల్వే స్టేషన్ నుంచి తాడ్బన్, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు క్లాక్ టవర్, ప్యాట్నీ, వైఎంసీఏ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- బైబిల్ హౌజ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తిరుమల గిరి వైపు వెళ్లేవారు గాస్మండి ఎక్స్‌రోడ్, హిల్స్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మళ్లించనున్నారు.
- ప్యారడైజ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు ప్యాట్నీ రోడ్డు మీదుగా సంగీత్ చౌరస్తా, చిలకలగూడ చౌరస్తా, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకోవాలి.
- క్లాక్ టవర్ నుంచి రాష్ట్ర పతి రోడ్డు వైపు వెళ్లే వాహనదారులు ప్యాట్నీ మీదుగా అలాగే ఎస్బీఐ లేదా ప్యారాడైజ్, మినిస్టర్స్ రోడ్డు , రసూల్ పురా, రాణిగంజ్ మీదుగా ట్యాంక్ బండ్ వెళ్లాల్సి ఉంటుంది.
- పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వెళ్లే వాహనాలు పంజాగుట్ట – ఖైరతాబాద్ జంక్షన్ – ఐమాక్స్ రోటరీ – తెలుగు తల్లి ఫ్లైఓవర్ – లోయర్ ట్యాంక్ బండ్ – ఆర్టీసీ ఎక్స్ రోడ్ – ముషీరాబాద్ ఎక్స్ రోడ్ – గాంధీ హాస్పిటల్ – చిలకల గూడ ఎక్స్ రోడ్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
- భక్తులు తమ వాహనాలను బయట ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో మాత్రమే పార్క్ చేసి అమ్మవారి దర్శనానికి రావాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ఫ్ లైన్ 9010203626 కు ఫోన్ చేయాలని సూచించారు.