రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో అధికారులు రాజ్ భవన్ కు ఇరువైపులా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజీగూడ, రాజీవ్ గాంధీ స్టాచ్యూ, రాజ్ భవన్ మెట్రో రెసిడెన్సీ, ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ జంక్షన్ వరకు ట్రాఫిక్ జాం ఉంటుందని పోలీసులు చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని, పోలీసులకు సహకరించాలని కోరారు.