
ఫ్లై ఓవర్స్ క్లోజ్ బేగంపేట్ ఫ్లై ఓవర్ కు మినహాయింపు
హైదరాబాద్, వెలుగు: న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా సిటీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారు జామున 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సీపీ అంజనీకుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ తో పాటు బేగంపేట్ ఫ్లై ఓవర్ మినహా సిటీలోని అన్ని ఫ్లై ఓవర్స్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సిటీ రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ బైక్ రేసింగ్స్ పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 100కి పైగా స్పెషల్ టీమ్స్ ను మంగళవారం రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు గస్తీ నిర్వహిస్తామని సీపీ తెలిపారు.
నేరేడ్మెట్: 2020 న్యూ ఇయర్ వేడుకల్లో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. మంగళవారం రాత్రి10 గంటల నుంచి బుధవారం 5 గంటల వరకు వాహనదారుల సేఫ్టీకోసం పలు ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్స్ క్లోజ్ చేస్తున్నామన్నారు.
ట్రాఫిక్ డైవర్షన్స్
పీవీ విగ్రహం వైపు నుంచి నెక్లెస్ రోడ్స్, ఎన్జీఆర్ మార్గ్ వైపు వచ్చే వెహికిల్స్.. ఖైరతాబాద్, రాజ్‌భవన్ రోడ్ వైపు
మళ్లించారు.
బీ ఆర్‌కె భవన్ నుంచి ఎన్‌టిఆర్ మార్గ్ వైపు వచ్చే వెహికిల్స్ తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్, లక్డీకాపుల్, అయోధ్య వైపు మళ్లిస్తారు.
లిబర్టీ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, తెలుగు తల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతితో పాటు ఇతర ప్రత్యామ్నాయ రూట్స్ తో ట్రావెల్ చేయాలి.
ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే ట్రాఫిక్… ఖైరతాబాద్ బడా గణేష్,సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లక్డికాపుల్ వైపు మళ్లిస్తారు.
సెక్రటేరియట్, మింట్ కాంపౌండ్ రూట్ లో సాధారణ వెహికిల్స్ ను అనుమతించరు.
నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి వచ్చే ట్రాఫిక్ సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్ వైపు అనుమతించరు. కర్బాలా, మినిస్టర్స్ రోడ్స్ మీదుగా మళ్లిస్తారు.
సికింద్రాబాద్ నుంచి వచ్చే వెహికిల్స్ సెయిలింగ్ క్లబ్, కవాడిగూడ క్రాస్ రోడ్స్,లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా దారి మళ్లిస్తారు.
సైబరాబాద్ లో..
గచ్చిబౌలి :సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్31ను పురస్కరించుకొని పోలీసులు ట్రాఫిక్ఆంక్షలు విధించారు.
ఔటర్ రింగు రోడ్డుపై ఎయిర్పోర్ట్ వైపు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కార్లను అనుమతించడం లేదు.
పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే పర్మిషన్.
సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ప్లైఓవర్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు మూసివేత.