V6 News

కవిత సభ.. మేడ్చల్ లో ట్రాఫిక్ ఆంక్షలు

కవిత సభ.. మేడ్చల్ లో ట్రాఫిక్ ఆంక్షలు

గచ్చిబౌలి, వెలుగు: మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. మేడ్చల్​జిల్లా మునీరాబాద్​లోని ఆద్వాయ కన్వెక్షన్​లో శనివారం ఇందుకు సంబంధించిన సభ జరగనుంది. పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో మేడ్చల్​ట్రాఫిక్​పోలీస్​స్టేషన్​పరిధిలో ట్రాఫిక్​ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్​పోలీస్​కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు వెల్లడించారు. 

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా:

వాహనదారులు మునీరాబాద్ గ్రామ రోడ్డుకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. సభకు వచ్చే వాహనాలు తప్ప మిగతా వాహనాలను మునీరాబాద్ వైపు అనుమతించరు.
భారీ వాహనాలకు మునీరాబాద్ రోడ్డులో అనుమతి లేదు. ఇవి కండ్లకోయ సర్వీస్ రోడ్డు లేదా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
ఇతర వాహనాలను గోపాల ఫార్మ్, పూడూరు గ్రామ రోడ్డు, కిష్టాపూర్, మేడ్చల్ రోడ్ల గుండా మళ్లించనున్నారు.
సీఎంఆర్ కాలేజీ క్రాస్ రోడ్డు నుండి మునీరాబాద్ వెళ్లే వాహనాలు కండ్లకోయ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీదుగా శామీర్‌‌‌‌పేట్ వైపు వెళ్లాలి.