జనవరి 18న సీఎం పర్యటన కారణంగా.. ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు

జనవరి 18న సీఎం పర్యటన కారణంగా.. ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఖమ్మం రూరల్, వెలుగు : సీఎం పర్యటన సందర్భంగా 18న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖమ్మంలో ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. భారీ వాహనాలు, లారీలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సజావుగా వెళ్లే వరకు హోల్డింగ్ పాయింట్లలో నిలుపుకోవాలని సూచించారు. 

 ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు

ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాజమండ్రి- దేవరపల్లి - జంగారెడ్డిగూడెం- అశ్వరావుపేట- సత్తుపల్లి- భద్రాచలం- కొత్తగూడెం -మణుగూరు మీదుగా,  హైదరాబాద్ వెళ్లే వాహనాలు (కార్లు, చిన్న వాహనాలు మాత్రమే) కల్లూరు,  వైరా సోమవరం గ్రామం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి కొదుమూరు వద్ద హైవే దిగి అల్లీపురం మీదుగా బోనకల్ రోడ్డు చేరుకొని ధంసలాపురం బ్రిడ్జి దగ్గర నుంచి మరల  గ్రీన్ ఫీల్డ్ హైవే  ఎక్కి హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. 
    
హైదరాబాద్ నుంచి భద్రాచలం- కొత్తగూడెం సత్తుపల్లి, - అశ్వారావుపేట-, -రాజమండ్రి వెళ్లే వాహనాలు పొన్నెకల్లు వద్ద గ్రీన్ ఫీల్డ్  హైవే మీదుగా వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద హైవే దిగి (కార్లు, చిన్న వాహనాలు మాత్రమే) ప్రకాశ్​ నగర్, చర్చి కాంపౌండ్, ముస్తఫా నగర్, అల్లిపురం మీదుగా కొదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బిడ్జి కింద నుంచి వందనం మీదుగా కొత్త కలెక్టరేట్ సమీపంలోని వైరా రోడ్డు చేరుకొని భద్రాచలం  - రాజమండ్రి వైపు వెళ్లాలని సూచించారు.

సత్తుపల్లి -అశ్వారావుపేట నుంచి వరంగల్ వైపునకు వెళ్లి వాహనాలు ఖమ్మం కలెక్టరేట్ దాటిన తర్వాత ఎస్ఆర్ గార్డెన్ నుంచి రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ మీదుగా లింగాల చేరుకొని డోర్నకల్- మహబూబాద్ మీదుగా వరంగల్ వెళ్లాలని చెప్పారు. ఇల్లెందు నుంచి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వాహనాలు ఇల్లెందు నుంచి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వాహనాలు రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ నుంచి ఎస్సార్ గార్డెన్  వచ్చి గోపాలపురం- గొల్లగూడెం మీదుగా లకారం చేరుకొని ఖమ్మం పట్టణంలోకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. 

వరంగల్ నుంచి సత్తుపల్లి, రాజమండ్రి-, కొత్తగూడెం, ఖమ్మం నగరంలోకి వచ్చే (కార్లు, చిన్న వాహనాలు మాత్రమే) ఏదులాపురం ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ మీదుగా నాయుడుపేట చేరుకొని అక్కడి నుంచి గాంధీ చౌక్ మీదుగా చర్చి కాంపౌండ్ ముస్తఫానగర్- అల్లీపురం కొదుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి కింద నుంచి వందనం మీదుగా కొత్త కలెక్టరేట్ సమీపంలోని వైరా రోడ్డు కు వెళ్లాలని సూచించారు.