జనవరి19న విజయవాడలో ట్రాఫిక్​ ఆంక్షలు..ఎక్కడెక్కడ ఎలా అంటే ?

జనవరి19న విజయవాడలో ట్రాఫిక్​ ఆంక్షలు..ఎక్కడెక్కడ ఎలా అంటే ?



విజయవాడలో శుక్రవారం ( జనవరి 19)125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నగరం వెలుపల ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటలకు ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసులు పేర్కొన్నారు. అనేక చోట్ల వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ముఖ్య వివరాలను వెల్లడించారు. వాహనదారులు ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపులు….

  • రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీం పట్నం నుంచి    జీ కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదగా దారి మళ్లిస్తారు
  •  విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల్ని కూడా హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, అవనిగడ్డ, రేపల్లె, చీరాల, ఒంగోలు మీదుగా మళ్లిస్తారు. 
  • గుంటూరు నుంచి విశాఖ వెళ్లే వాహనాల్ని బుడంపాడు నుంచి తెనాలి, వేమూరు, అవనిగడ్డ, గుడివాడ, జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. 
  • చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల్ని బాపట్ల జిల్లా మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తారు. 
  •  విజయవాడ నగరంలోనూ ఆర్టీసీ బస్సుల్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మళ్లిస్తారు. 
  • విశాఖ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్ని రామవరప్పాడు రింగ్, బెంజి సర్కిల్ మీదుగా బస్టాండ్ కు పంపుతారు.
  •  బందరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు తాడిగడప, ఎనికేపాడు, రామవరప్పాడు రింగ్ మీదుగా బస్టాండ్ కు పంపుతారు. 
  •  బస్టాండ్ నుంచి విశాఖ వెళ్లే బస్సులు పీసీఆర్ జంక్షన్, ప్రకాశం విగ్రహం, పాత ప్రభుత్వాసుపత్రి, ఏలూరు లాకులు, బీఆర్టీఎస్ రోడ్డు, పుడ్ జంక్షన్ మీదుగా రామవరప్పాడు రింగ్ వైపుకు మళ్లిస్తారు. 
  • బస్టాండ్ నుంచి బందరు వెళ్లే బస్సులు ఇదే మార్గంలో వెళ్లి ఎనికేపాడు, తాడిగడప మీదుగా పంపుతారు