బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండుగా ఉన్న బస్సు పద్మావతి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది సజీవ జలసమాధి అయ్యారు. మరికొందరు గల్లంతయ్యారు. నైరుతి జిల్లా రాజ్‌బారిలోని దౌలడియా టెర్మినల్ దగ్గర బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
నది దాటేందుకు రవాణా ఫెర్రీ (నౌక) ఎక్కే క్రమంలో బస్సు నదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులతోపాటు బస్సు నదిలో మునిగిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది క్రేన్ల సహాయం తోబస్సును బయటికి తీశారు. కొంతమంది ప్రయాణికులను రక్షించారు. మొత్తం 16 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. 14 మృతదేహాలు వెలికితీశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
🚨🇧🇩 A Souhardya Paribahan bus lost control while boarding a ferry at Daulatdia, Rajbari, and fell into the Padma River.
— Asian U.K. News (@AsianUKNews) March 25, 2026
Some passengers swam ashore, but many are feared missing. #bus #Bangladesh pic.twitter.com/DG7isT9ZcH
