
పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వెంకటేశ్వర హిల్స్ కాలనీలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన కొద్ది గంటల వ్యవధిలోనే భార్య కూడా చనిపోయింది. కాలనీకి చెందిన శ్యాంపూరి భాస్కరరావు (60) శనివారం గుండెపోటుతో చనిపోయాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక అతడి భార్య బాయమ్మ (50) రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మనోవేదనతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసింది. 40 ఏండ్లుగా ఒకరికొకరుగా కలిసి బతికారని, భర్త లేడన్న విషయం తట్టుకోలేక బాయమ్మ కూడా తనువు చాలించిందని బంధువులు వాపోయారు.