
హైదర్ గూడ: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. హైదర్ గూడ పరిధిలోని ఎర్రబోడలో హార్పిక్ తాగి దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. రమేష్, రాజేశ్వరిలు హార్పిక్ తాగి బలవన్మరణానికి యత్నించారు. వీరిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేశ్వరి మృతి చెందింది.
హార్పిక్ తాగడంతో కడుపులో పేగులు కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. రాజేశ్వరి భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. రాజేంద్ర నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.