భర్త చనిపోయాడనే దిగులుతో భార్య ఆత్మహత్య

భర్త చనిపోయాడనే దిగులుతో భార్య ఆత్మహత్య
  •     మహబూబాబాద్​ జిల్లా రౌతుపల్లి తండాలో విషాదం

కొత్తగూడ,వెలుగు :10 రోజుల క్రితం భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోగా...అతడు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక భార్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మహబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం రౌతుపల్లి తండాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. ఎస్​ఐ దిలీప్​కథనం ప్రకారం..తండాకు చెందిన మాలోతు సరిత(35)భర్త రవి ఈనెల 5న సంగెం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. 

అంతకు ముందు ఆమె చెల్లెలు కూడా చనిపోయింది.18 ఏండ్లయినా పిల్లలు లేక ఇటు భర్త, చెల్లెలు చనిపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైంది. దీంతో చనిపోవాలని నిర్ణయించుకుని శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.