
- భద్రాద్రి జిల్లా మాచినేనిపేట పెద్దతండాలో ఘటన
జూలూరుపాడు,వెలుగు: నీటి సంపులో పడి చిన్నారి చనిపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం మాచినేనిపేట పెద్ద తండాకు చెందిన భూక్య గోపి నాయక్, సరస్వతి దంపతుల కూతురు తన్వి శ్రీ (రెండున్నరేండ్లు) సోమవారం సాయంత్రం అదే గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడిపోయింది.
పనిలో నిమగ్నమైన చిన్నారి అమ్మమ్మ కొద్దిసేపటి తర్వాత పాప కోసం వెతకగా నీటి సంపులో పడి ఉంది. కేకలు వేయగా స్థానికులు వచ్చి పాపను బయటకు తీయగా అప్పటికే చనిపోయింది. చిన్నారి మృతితో కుటుంబంతో తీవ్ర విషాదం నెలకొంది.