కడుపునొప్పితో వెళ్తే.. ప్రాణం పోయింది.. హనుమకొండలోని బంధన్ ఆస్పత్రిలో ఘటన

కడుపునొప్పితో వెళ్తే.. ప్రాణం పోయింది.. హనుమకొండలోని బంధన్ ఆస్పత్రిలో ఘటన

హనుమకొండ సిటీ, వెలుగు: కడుపులో నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.  వైద్య సిబ్బందే ప్రాణాలు తీశారంటూ కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళనకు దిగిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. రంగశాయిపేటకు చెందిన మహేందర్​రావు(50) ఆదివారం కడుపునొప్పితో బాధపడుతూ హనుమకొండలోని బంధన్​ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి వివిధ రకాల టెస్ట్ చేసి డాక్టర్లు.. ట్రీట్​మెంట్​అందించారు.

సోమవారం ఉదయం మహేందర్​రావు మృతి చెందాడంటూ వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయారని ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హనుమకొండ వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పత్రికి వెళ్లి విచారించారు.  ఆస్పత్రి మేనేజ్ మెంట్ తో మాట్లాడి వివరాలు సేకరించారు.