పోలీసు రిక్రూమెంట్ పరుగు పందెంలో విషాదం

 పోలీసు రిక్రూమెంట్ పరుగు పందెంలో  విషాదం

వరంగల్ జిల్లా: పోలీసు రిక్రూమెంట్ పరుగు పందెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరుగు పందెంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలిన రాజేందర్ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన విషాదం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. 

వరంగల్ కాకతీయ  యూనివర్సిటీ గ్రౌండ్ లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టు ల నిర్వహిస్తున్నారు. పోలీసు ఉద్యోగాల నియామకం కోసం చేపట్టిన ఈ ప్రక్రియలో ములుగు జిల్లా శివా తండాకు చెందిన  రాజేందర్ అనే యువకుడు పాల్గొన్నాడు. ఈనెల 17వ తేదీ న 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న రాజేందర్  అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గుర్తించి హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజేందర్ కు నాలుగు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. కోలుకోలేక ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచాడు.