
హీరో రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా వస్తున్న చిత్రం ‘భలే ఉన్నాడే’. డైరెక్టర్ మారుతి ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. జె శివసాయి వర్ధన్ దర్శకుడు. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అమ్మాయిలంటే ఆమడ దూరంలో ఉండే హీరో పాత్రని పరిచయం చేస్తూ సాగిన ట్రైలర్ హిలేరియస్‌గా ఉంది. రాజ్ తరుణ్ , మనీషా కంద్కూర్‌ల మధ్య వచ్చే సీన్స్, లవ్ స్టోరీ ఇంటరెస్టింగ్‌గా ఉంటూనే, వీటీవీ గణేష్‌తో సాగే ఫన్నీ ట్రాక్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది.
ఫన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సింగీతం శ్రీనివాస్, అభిరామి, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ ఇతర పాత్రలు పోషించారు. ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది.