
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మారుమూల ఎలాంటి ఘటన జరిగినా.. ఏదైనా వింత ఉన్నా ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత ఫేస్ బుక్, ట్విట్టర్ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో వేరే చెప్పనక్కరలేదు. తాజాగా ఓ సరస్సు మధ్యలో ట్రైన్ వెళ్లే వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. ఈ రైల్వే మార్గం సోవియట్ కాలంలో వేయబడింది .. అప్పటి నుండి రైలు సరస్సు గుండా వెళుతుంది.
తాజాగా సైబీరియాలోని ఒక సరస్సు వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత, ఎవరైనా ఫేక్ వీడియో పోస్ట్ చేసారనే భావన కలుగుతుంది. కాని ఇది వాస్తవం. షాకింగ్ వీడియోలు @gunsnrosesgirl3 అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయబడతాయి. ఈ ఖాతాలో షేర్ చేయబడిన వీడియోలో సరస్సులోని నీరు ఎరుపు రంగుతో కనిపిస్తూ దాని మధ్య నుండి ఒక రైలు నడుస్తోంది. సైబీరియాలోని బర్లిన్ కోయ్ సరస్సు మధ్యలో నుండి ట్రైన్ వెళ్లేటప్పుడు నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. దీనిని సైబీరియా పింక్ లేక్ అని కూడా పిలుస్తారు
నీరు ఎలా ఎర్రగా మారుతుంది
ప్రపంచంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక ప్రదేశం సైబీరియా (సైబీరియా లేక్ రైలు)లో ఉంది. సమ్మర్ లో సైబీరియా ప్రాంతం భిన్నమైన ప్రదేశంగా కనిపిస్తుంది. కజకిస్తాన్ సరిహద్దులో బెర్లిన్ కోయ్ సరస్సు ఉంది. దీనిలోని నీరు వేసవిలో ఎర్రగా మారుతుంది . ఎండాకాలం ఆర్టెమియా సాలీనా జీవులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ జీవుల హిమోగ్లోబిన్ పిగ్మెంటేషన్ కారణంగా నీటి రంగు మారుతుంది.
వీడియో వైరల్
ఈ వీడియోకు 13 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి, అయితే చాలా మంది వ్యక్తులు తమ అభిప్రాయాన్ని కామెంట్ చేశారు. ఇది రియల్ సీన్ అని చాలా మంది నమ్మలేకపోతున్నారు. దీన్ని తయారు చేయడం చాలా కష్టమని ఒకరు అన్నారు. ఇది చాలా అందమైన దృశ్యం అని మరొకరు అన్నారు. అలాంటి రంగులు భూమిపై కూడా కనిపిస్తాయని తనకు తెలియదని ఇంకొకరు కామెంట్ చేశారు.