- కొత్త ఏడాదిలో మండలాల్లో పోస్టింగ్
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు కొత్తగా 246 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ)లు జాయిన్ అయ్యారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వీరిని హౌసింగ్
కార్పొరేషన్ ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకుంది. వీరికి ఈ నెల 27 నుంచి 5 రోజుల పాటు హౌసింగ్ అధికారులు, నిపుణులతో మాదాపూర్‌లోని న్యాక్ క్యాంపస్‌లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ పూర్తయ్యాక జనవరి 1 నుంచి కలెక్టర్లు వీరికి మండలాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం రెగ్యులర్ అధికారులు లేకపోవటంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.
మరోవైపు, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పద్ధతిలో హౌసింగ్ కార్పొరేషన్‌కు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, గ్రూప్1 ఆఫీసర్లును తీసుకున్నారు. ఇటీవల మిషన్ భగీరథ నుంచి 20 మంది డిప్యూటీ ఇంజనీర్లు (డీఈ), 15 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఏఈఈ), 30 మంది ఏపీవో (మండల్ పరిషత్ ఆఫీసర్లు)లను తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో డీఈని నియమించనుండగా, మండలానికి ఏఈఈలు, ప్రతి 500 ఇండ్లకు ఏఈలను నియమించనున్నారు.
