సికింద్రాబాద్లో అన్ని ప్లాట్ఫామ్స్పైకి ట్రైన్స్.. 24 రైళ్లకు అదనపు స్టాపులు..

సికింద్రాబాద్లో అన్ని ప్లాట్ఫామ్స్పైకి ట్రైన్స్.. 24 రైళ్లకు అదనపు స్టాపులు..
  • 24  రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు స్టాప్‌‌‌‌‌‌‌‌లు 
  • సికింద్రాబాద్​ డివిజనల్​ మేనేజర్​ గోపాలకృష్ణన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను చేసినట్టు సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ మేనేజర్​డాక్టర్ ఆర్. గోపాల కృష్ణన్  వివరించారు. స్టేషన్​కు సగటున 1.34 లక్షలు మంది వస్తుండగా, పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇది దాదాపు 1.84 లక్షలకు పెరిగిందన్నారు. ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌కు ఒకవైపు గేట్– 2,  గేట్– 4 వద్ద కొత్త హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ వైపు కొత్త ఎగ్జిట్ గేట్ 5A తెరిచినట్టు చెప్పారు. 

టెర్మినల్స్​లో రద్దీ తగ్గించడానికి, అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లోని 24  రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు స్టాప్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశామన్నారు. స్టేషన్లలో సీసీటీవీ నిఘా పెంచామని, 17 టికెటింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, సికింద్రాబాద్ స్టేషన్, డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో వార్ రూమ్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

అన్ని ప్లాట్ ఫామ్స్ పై ట్రైన్స్​ కు అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ డివిజన్ అదనపు డీఆర్ఎం ఆపరేషన్స్ సంజీవరావు, రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్​షిఫాలి పాల్గొన్నారు.