కీసర, వెలుగు: ట్రాలీ ఆటో ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకటరమణ రాంపల్లి ఆర్ఎల్ నగర్లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో కుటుంబంతో కలిసి కీసరగుట్టకు వచ్చాడు. భోజనానికి కావాల్సిన సామగ్రి తెచ్చేందుకు కీసరగుట్ట నుంచి బైక్‌పై కీసరకు బయల్దేరాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న అశోక్ లీలాండ్ గూడ్స్ వెహికల్ ఢీకొట్టడంతో స్పాట్లో చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డీసీఎం ఢీకొని..
జీడిమెట్ల: డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. శామీర్‌పేట దేవరయాంజల్ గ్రామానికి చెందిన గొడుగు బాలరాజు(44) ప్రైవేటు ఉద్యోగి. సోమవారం తన ఇంటి వద్ద గల డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద నిలబడి ఉన్నాడు. తూము కుంట నుంచి దేవరయాంజల్ వైపు వస్తున్న డీసీఎం రోడ్డు పక్కన నిల్చున్న బాలరాజును ఢీకొట్టడంతో చనిపోయాడు.
