కరెంట్ మీటర్‌కు లంచం... అడ్డంగా దొరికిన అధికారి

కరెంట్ మీటర్‌కు లంచం... అడ్డంగా దొరికిన అధికారి

 

  • రూ. 10 వేలు తీసుకుంటూ దొరికిన ట్రాన్స్ కో అధికారులు
  • లైన్​ ఇన్​స్పెక్టర్​, లైన్​మన్​ను అరెస్ట్​ చేసిన ఏసీబీ

మాదాపూర్, వెలుగు: కరెంట్​మీటర్​పెట్టేందుకు లంచం తీసుకుంటూ ట్రాన్స్​కో అధికారులు ఏసీబీకి రెడ్​ హ్యాండెడ్​గా దొరికారు. మాదాపూర్​సాయినగర్​లో ఉండే  ఎం. లక్ష్మణ్​ కుమార్తె నాగజ్యోతి ఇంటికి కరెంట్​ మీటర్ కోసం కొద్ది రోజుల కిందట అప్లై చేసుకుంది. మాదాపూర్​ ట్రాన్స్ కో  లైన్​ ఇన్​స్పెక్టర్​ ప్రభాకర్​రావు,  లైన్​మన్​ ఎం. సతీష్​ రూ. 10వేలు లంచం డిమాండ్​ చేశారు. దీంతో  లక్ష్మణ్​ ఏసీబీకి కంప్లయింట్​చేశాడు. శనివారం ఉదయం మాదాపూర్​ ట్రాక్స్​కో ఆపరేషన్స్​ ఆఫీస్​లో లక్ష్మణ్​ నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటున్న లైన్​ ఇన్​స్పెక్టర్ ​ప్రభాకర్​రావు, లైన్​మన్ ​ఎం. సతీష్​లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  వారిని అరెస్ట్​ చేసి ఏసీబీ కోర్టులో  హాజరు పరిచినట్టు  ఏసీబీ డీజీ అంజనీ కుమార్​ తెలిపారు.