సింగరేణిలో 56 మంది ఆఫీసర్ల ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌

సింగరేణిలో 56 మంది ఆఫీసర్ల ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులు, ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లలో పనిచేస్తున్న 56 మంది మైనింగ్‌‌‌‌ ఆఫీసర్లు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయ్యారు. ఇల్లందు ఎస్‌‌‌‌వో టుజీఎంగా పనిచేస్తున్న ఎం.మల్లయ్య మందమర్రి కేకే ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌కు, అక్కడ డీజీఎంగా పనిచేస్తున్న ఎల్.రమేశ్‌‌‌‌ ఆర్జీ 1 ఏరియా జీడీకే 1, కొత్తగూడెం సేఫ్టీ డీజీఎంగా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వరరావు మందమర్రి సేప్టీ వింగ్‌‌‌‌కు, అక్కడ పనిచేస్తున్న ఎం.రవీందర్‌‌‌‌ కొత్తగూడెం సేప్టీ వింగ్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయ్యారు.

బెల్లంపల్లి, కార్పొరేట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎంటీసీ డీజీఎంగా ఉన్న జీవీఎన్‌‌‌‌ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ను ఆర్జీ 2కు, కార్పొరేట్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌టీసీకి, జీడీకే 1 ఇంక్లైన్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ డి.రమేశ్‌‌‌‌బాబును జీడీకే 2వ గనికి, మణుగూరు ఎస్‌‌‌‌అండ్‌‌‌‌పీసీ అడిషనల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ షాబీరుద్దీన్‌‌‌‌ ఆర్జీ 3 ఏరియా ఎస్‌‌‌‌అండ్‌‌‌‌పీసీకి, జీడీకే ఓసీపీ 5 మేనేజర్‌‌‌‌గా పనిచేస్తున్న జె.తిరుపతి శ్రీరాంపూర ఆర్‌‌‌‌కే 7 మైన్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేస్తూ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఇంకా అడిషనల్‌‌‌‌ మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు, ఎస్‌‌‌‌ఈలు, డిప్యూటీ ఎస్‌‌‌‌ఈలు, సీనియర్‌‌‌‌ అండర్‌‌‌‌ మేనేజర్లు, అండర్‌‌‌‌ మేనేజర్లు ఉన్నారు.