లిక్కర్ కేసు విచారిస్తున్న జడ్జి నాగ్ పాల్ బదిలీ

లిక్కర్ కేసు విచారిస్తున్న జడ్జి నాగ్ పాల్ బదిలీ
  •      ఢిల్లీ హైకోర్టు పరిధిలో 58 మంది జడ్జీలకు ట్రాన్స్​ఫర్లు 

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ బదిలీ అయ్యారు. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు నుంచి తీస్‌ హజారీ జిల్లా కోర్టు జడ్జిగా ఆయన ట్రాన్స్ ఫర్ అయ్యారు. నాగ్​పాల్ స్థానంలో ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజాను నియమించారు. ఢిల్లీ హైకోర్టు పరిధిలో మొత్తం 58 మంది జడ్జీలను బదిలీ చేశారు. హయ్యర్‌ జ్యుడీషియల్‌ సర్వీసెస్‌ కింద వివిధ జిల్లా కోర్టుల్లో, ప్రత్యేక కోర్టుల్లో జడ్జీలుగా పని చేస్తున్న 27 మందిని.. ఢిల్లీ జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో పని చేస్తున్న 31 మందిని బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.