ముగ్గురు జాయింట్ ట్రాన్స్‌‌పోర్ట్ కమిషనర్ల బదిలీ

ముగ్గురు జాయింట్ ట్రాన్స్‌‌పోర్ట్ కమిషనర్ల బదిలీ

 హైదరాబాద్, వెలుగు : ట్రాన్స్‌‌పోర్ట్ డిపార్ట్‌‌మెంట్‌‌లో చాలా కాలంగా ఓకే దగ్గర పనిచేస్తున్న ముగ్గురు జాయింట్ ట్రాన్స్‌‌పోర్ట్ కమిషనర్లను (జేటీసీ) బదిలీ చేస్తూ ఆ శాఖ సెక్రటరీ శ్రీనివాస రాజు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్‌‌ను అడ్మిన్ జేటీసీగా.. అడ్మిన్ జేటీసీగా ఉన్న మమతా ప్రసాద్‌‌ను ఐటీ, విజిలెన్స్ జేటీసీగా.. ఐటీ, విజిలెన్స్ జేటీసీగా పనిచేస్తున్న రమేశ్‌‌ను హైదరాబాద్ జేటీసీగా ట్రాన్స్‌‌ఫర్ చేసింది. ఈ ముగ్గురు అధికారులు శనివారం కొత్త పోస్టుల్లో బాధ్యతలు చేపట్టారు.

మరోవైపు, రవాణా శాఖలో ఓడీ (ఆన్ డ్యూటీ)లను రద్దు చేస్తూ రాష్ట్ర సర్కారు మరో ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్రంలో 15 చెక్ పోస్టుల్లో మోటార్ వెహికల్ ఇన్‌‌స్పెక్టర్ (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌‌స్పెక్టర్లు (ఏఎంవీఐ) ఆన్ డ్యూటీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి డ్యూటీ ఒక దగ్గర అయితే చెక్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. దీంతో వీరందరూ తిరిగి పాత ప్లేస్‌‌లోకి వెళ్లి పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

చెక్ పోస్టుల దగ్గర ఉంటున్న ట్రాఫిక్, వస్తున్న రెవెన్యూ ఆధారంగా డివైడ్ చేసి ఎంత మంది అధికారులు ఉండాలి.. ఎంత మంది ఉన్నారు.. కొత్త వాళ్లు ఎంత మంది అవసరం అనే వివరాలపై అధ్యయనం చేయనున్నారు. దీనిపై త్వరలో ప్రభుత్వానికి ఆర్టీఏ అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.