శ్రీశైలం దేవస్థానంలో బదిలీలు.. ఏఈవో నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు..

శ్రీశైలం దేవస్థానంలో బదిలీలు.. ఏఈవో నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు..

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భారీగా ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేశారు అధికారులు. నిన్నటి ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలను నిలిపివేస్తూ ఆ ఉత్తర్వులు రద్దు చేస్తూ.. ఇవాళ మళ్లీ కొత్త ఉత్తర్వులు ఇచ్చారు. 71 మంది ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

ఏఈవో నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగి స్థాయి వరకు మొత్తం 71 మందిని ట్రాన్స్ ఫర్ చేశారు. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి దేవస్థానంలో భారీగా బదిలీలు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం అంతర్గత బదిలీ చేసినట్లు తెలిపారు ఆలయ ఈవో పెద్దిరాజు.