నిర్మల్​ జిల్లాలో 735 మంది టీచర్లకు బదిలీలు

నిర్మల్​ జిల్లాలో 735 మంది టీచర్లకు బదిలీలు

నిర్మల్, వెలుగు : జిల్లాలో 735 మంది ఎస్​జీటీ టీచర్లకు ట్రాన్స్ ఫర్లు జరిగాయని నిర్మల్ డీఈఓ రవీందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బదిలీల కోసం 895 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 735 మందికి బదిలీలు జరిగాయన్నారు. వీరంతా సోమవారం తమకు కేటాయించిన పాఠశాలలో చేరారని పేర్కొన్నారు.