జూబ్లీహిల్స్ , వెలుగు: ఓ ప్రైవేట్ ఉద్యోగిని సెక్స్ పేరుతోట్రాన్స్జెండర్బెదిరించి, రూ.1.40 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను దోచుకుంది. ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తి (44) గత నెల 28న రాత్రి జూబ్లీహిల్స్పరిధిలోని టాస్ పబ్ సమీపంలో ఉండగా, గాయత్రి అనే ట్రాన్స్జెండర్ అతని వద్దకు వచ్చి సెక్స్పేరుతో తన నివాసానికి తీసుకెళ్లింది. అనంతరం అతడిని బెదిరించి రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
డబ్బు ఇవ్వకపోతే పరువు తీస్తానని, తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని హెచ్చరించింది. కుటుంబ సభ్యులకు విషయం తెలిసిపోతుందనే భయంతో బాధితుడు రూ.1.40 లక్షల నగదు, బంగారు గాజులను ఆమెకు అప్పగించాడు. అయినప్పటికీ నిందితురాలు మరిన్ని డబ్బులు కోసం వేధింపులకు గురిచేయడంతో బాధితుడు శనివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
