పోలీస్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ట్రాన్స్ జెండర్ల డిమాండ్

పోలీస్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ట్రాన్స్ జెండర్ల డిమాండ్

ట్రాన్స్ జెండర్లు సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రస్తుతం జరుగుతున్న దేహదారుడ్య పరీక్షల్లో యువతీ యువకులకు  వేరు వేరుగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లే..తమకు ప్రత్యేక కోటా కేటాయించాలని ట్రాన్స్ జెండర్స్ కోరారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్కు  ట్రాన్స్ జెండర్స్ వినతి పత్రం ఇవ్వనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాత పరీక్షలకు 12 మంది ట్రాన్స్ జెండర్స్ హాజరయ్యారు. రాత పరీక్షల్లో నందిని, తనుశ్రీ, లవ్ లీ, శ్రావ్య శ్రీ అనే నలుగురు ట్రాన్స్ జెండర్స్ పాసై...ఈవెంట్స్కు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో -పోలీస్ ఉద్యోగ నియమకాలలో ట్రాన్స్ జెండర్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

-