- మంత్రి పొన్నం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఉచిత బస్సు ప్రయాణంతో తెలంగాణ మహిళలు సాధికారత సాధించారని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించి మంగళవారంతో రెండేండ్లు పూర్తయ్యిందన్నారు. ఈ రెండేండ్లలో 251 కోట్ల మంది మహిళలు రూ.8,459 కోట్ల జీరో టికెట్లను వినియోగించుకున్నారని మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు బంధుత్వాలను పెంచుకున్నారని, దేవాలయాల సందర్శన, వైద్య చికిత్సల కోసం ఇతర ప్రాంతాల ఆస్పత్రులకు వెళ్లగలిగారని చెప్పారు. మహిళలను బస్సులకు యజమానులుగాచేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలోని మహిళలకు, ఆర్టీసీ సిబ్బందికి మంత్రి పొన్నం అభినందనలు చెప్పారు.

