న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలను గుర్తించడానికి ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్ కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిని బ్యాటరీ ప్యాక్ ఆధార్ నంబర్ (బీపీఏన్) అని పిలుస్తారు. దీనివల్ల బ్యాటరీల తయారీ నుంచి రీసైక్లింగ్ వరకు అన్ని వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
బ్యాటరీ తయారీదారులు లేదా దిగుమతిదారులు ప్రతి బ్యాటరీపై 21 అంకెల బీపీఏన్ వేయాల్సి ఉంటుంది. ముడి సరుకుల సేకరణ, తయారీ, వాడకం, విసర్జన వంటి వివరాలన్నీ ఒక పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి. ఈ వ్యవస్థ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి.
