
వాషింగ్టన్: ప్రపంచంలోని 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ సోమవారం (June 9) నుంచి అమల్లోకి వచ్చింది. ట్రావెల్ బ్యాన్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పలుచోట్ల ఉద్రిక్తతలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్న సమయంలోనే ఈ బ్యాన్ ను సర్కారు అమల్లోకి తెచ్చింది.
ఈ నెల 5న కొత్త ఇమిగ్రేషన్ పాలసీపై ట్రంప్ సంతకం చేసి ఆదేశాలు జారీ చేశారు. అఫ్గానిస్తాన్, చాద్, మయన్మార్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ దేశాల పౌరులకు ఈ నిషేధం వర్తిస్తుంది.