
హైదరాబాద్ అల్వాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడి కక్కడే చనిపోయారు.ఈ ఘటన బుధవారం కరీంనగర్ రాజీవ్ రహదారిపై జరిగింది. మృతి చెందిన వ్యక్తులను జగదీష్, శిరీష్‌గా గుర్తించారు. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా హాకీంపేటలో ఈ ప్రమాదం జరిగింది. తూముకుంటలోని తమ బంధువుల ఇంటికి నుంచి తెల్లవారు జామున తమ పల్సర్ బైక్‌పై తిరిగి వెళ్తుండగా హాకీంపేట టర్నింగ్ దగ్గర జగిత్యాలకు చెందిన పూజిత ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు… పోస్టుమర్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.